తల్లిదండ్రుల్ని పట్టించుకోని స్టార్ హీరో.. వారిని నిజంగానే అవమానించాడా?

Published on Sat, 03/11/2023 - 14:46

దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.  అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్‌ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్‌లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.  కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే.

చెన్నైలో జరిగిన ఈ  వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్‌ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై  విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా  ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్‌లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు.

కాగా.. గతంలో విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)