Breaking News

హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?

Published on Sat, 07/27/2024 - 07:15

హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.

(ఇదీ చదవండి: సలార్‌ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్‌ పోస్ట్‌ వైరల్!)

గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.

'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్‌తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)