ఆ విషయంలో టాలీవుడ్‌ గ్రేట్‌: తమిళ నిర్మాత రాజన్‌

Published on Mon, 08/08/2022 - 12:52

ఆర్‌ఎఫ్‌ఐ ఫిలింస్‌ పతాకంపై రెహాన్‌ అహ్మద్‌ నిర్మించిన చిత్రం ‘విచిత్రం’. వీఆర్‌ఆర్‌ దర్శకత్వం వహించిన ఈ త్రంలో నటుడు శ్రీనివాస్, ఈరిన్‌ జంటగా నటించారు. పలువురు పాత కొత్త నటీనటులు ముఖ్యపాత్ర పోషింన ఈ త్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక వడపళనిలోని కమల థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, నిర్మాత కె.రాజన్‌ మాట్లాడుతూ చిన్న బడ్జెట్‌ చిత్రాలు విజయం సాధిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు.

చదవండి: విజయ్‌-లోకేశ్‌ కనకరాజుల మూవీ.. బయటికొచ్చిన కథ!

దానివల్ల కార్మికులు బాగుంటారన్నారు. ఈ చిత్ర యూనిట్‌ విజయవంతం అయితేనే మళ్లీ వాళ్లు సినిమా చేస్తారన్నారు. విచిత్రం మూవీ నిర్మాత చాలా ఉన్నత వ్యక్తి అని, మంచి యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాన్ని నిర్మించారని, విత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే తమిళనాడులో హీరోలకు 60 శాతం పారితోషికం చెల్లించే పరిస్థితి నెలకొంది అన్నారు. అలాంటి చిత్రాలు చేస్తే ఎలా ఆడతాయని ప్రశ్నించారు. నిర్మాతలు బతికి బట్ట కట్టకపోతే చిత్ర పరిశ్రమ బతక లేదన్నారు. ఈ విషయంలో తెలుగు చిత్ర నిర్మాతలు దమ్మున్న వారని, హీరోలు పారితోషికం, నిర్మాణ వ్యయం వంటివి తగ్గించే విషయమై చర్చించేందుకు షూటింగ్‌లను రద్దు చేశారని ప్రసంశించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ