Breaking News

ఇళయారాజా బర్త్‌డే.. ఇంటికి వెళ్లి మరీ విష్‌ చేసిన తమిళనాడు సీఎం

Published on Sat, 06/03/2023 - 14:52

సంగీతాన్ని నవరసాల్లో నాట్యం చేయించే రారాజు ఇళయరాజా. సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందంటారు. ఇళయరాజా సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. 80 వసంతాల ఇళయరాజా నేటికీ సంగీత రారాజుగానే కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన 80వ పుట్టినరోజు. ఇది సంగీతానికే జన్మదినం అన్నంతగా సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సంగీత జ్ఞానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు అందించి శాలువాతో సత్కరించారు.

స్టాలిన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తొలిపొద్దు మధురంగా మారడానికి, ప్రయాణాలు సుఖవంతం కావడానికి, ఆనందమయం కావడానికి, కష్టాలు గాలిలో కలిసిపోవడానికి, రాత్రులు ప్రశాంతమయం కావడానికి కారణం సంగీత జ్ఞాని ఇళయరాజానే. ఆయన మన హృదయాలను రంజింపజేస్తున్నారు. తమిళ చిత్ర సీమకు మాత్రమే కాకుండా సంగీత ప్రపంచానికే ఆయన ఒక విప్లవం. అందుకే కరుణానిధి ఆయనను సంగీత జ్ఞాని అని కొనియాడారు. ఆయన సంగీతానికి మైమరచిపోయే అభిమానుల్లో ఒకరినైన నేను ఆ గొప్ప కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆనందిస్తున్నాను.

మా హృదయాల్లో కోట కట్టి, జెండా నాటిన మీరు ఎప్పటికీ రాజానే, శతాధిక వసంతాలు దాటిన ఇళయరాజానే‘ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నటుడు కమల్‌ హాసన్‌  సైతం ఇళయారాజాకు ట్విటర్‌లో విష్‌ చేశారు. ‘సినీ సంగీతం 8 దశాబ్దాలు అధిగమించి సంతోషంగా కొనసాగుతోంది. ఇళయరాజా అనే ఐదు అక్షరాలు భారతీయ సినీ సంగీతంలో అపూర్వస్వరాలు అనేంతగా తన సంగీత సింహాసనాన్ని ఏర్పరచుకున్న తన ప్రియమైన, అన్నయ్య ఇళయరాజాకు హ్యాప్‌ బర్త్‌డే' అని పేర్కొన్నారు.

చదవండి: విషమంగా పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్యం

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)