Breaking News

ఫ్యాన్స్‌తో విజయ్‌ చర్చలు.. మళ్లీ ఆదే టాపిక్‌ వైరల్‌

Published on Wed, 07/12/2023 - 08:53

హీరో విజయ్‌..  కోలీవుడ్‌లో ఈ పేరు ఇప్పుడు ఆయన అభిమానులకు తారక మంత్రంగా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిగ్‌గా మారింది. వివరాలు.. విజయ్‌ అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన నటుడిగా ఎదిగారు. తన అభిమాన సంఘాలను విజయ్‌ ప్రజా సంఘాలుగా మార్చారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన 10, ప్లస్‌–1, ప్లస్‌–2 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన నియోజకవర్గం ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని తన కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

(ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్‌ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్)

ఈ సందర్భంగా విద్యార్థులకు పలు హిత వాక్యాలు చేశారు. ముఖ్యంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదనే విషయాన్ని తనదైన శైలిలో స్పష్టం చేశారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ, టీవీ ఛానల్లో పెద్ద డిబేట్‌ జరిగింది. అంతేకాకుండా విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్‌ మంగళవారం ఉదయం మరోసారి తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశారు.

(ఇదీ చదవండి: ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?)

ఈ సందర్భంగా తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అదే విధంగా మరికొన్ని రాజకీయ పరమైన అంశాల గురించి తీవ్రంగా కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 15 జిల్లాలకు చెందిన విజయ్‌ ప్రజా సంఘం నిర్వాహకులు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో మారోసారి విజయ్‌ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)