Breaking News

ప్రాణం లేని మనిషి ఈ సినిమా హీరో

Published on Fri, 02/14/2025 - 02:12

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

కదలని బొమ్మ చిత్రమైతే, కదిలే బొమ్మ ఓ విచిత్రం. అటువంటి విచిత్రానికి వినోదం తోడైతే అదే మనం చూసే సినిమా. సినిమాలలో దర్శకుడు తన కాల్పనిక ధోరణితో ఓ కథను అనుకొని ఆ కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆ పాత్రలచే ప్రేక్షకులకు విచిత్ర వినోదాన్ని అందిస్తాడు. ప్రస్తుతం వచ్చే సినిమాలలో ఔరా అని అబ్బురపరిచే సినిమాలనుండి అయ్యో అనే సినిమాల వరకూ పుష్కలంగా ఉన్నాయి. సన్‌ నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘జాలీ ఓ జిమ్ఖానా’(Jolly O Gymkhana) సినిమా ఔరా అనిపించే ఓ అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు.

ప్రముఖ కథానాయకుడు, కొరియోగ్రాఫర్‌ అలాగే దర్శకుడు అయిన ప్రభుదేవా(Prabhu Deva) ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓసారి కథ గురించి చెప్పుకుందాం. భవానీ అనే అమ్మాయి తను చేసిన ఓ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కథ చెప్పుకోడానికి ఓ చర్చిలోని ఫాదర్‌ దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవానీ, శివానీ, యాజినీతో ఓ హోటల్‌ నడుపుతుంటాడు. తెన్‌ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్‌తో హోటల్‌లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు.

తంగసామి ఆపరేషన్‌ కోసం దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని భవానీ అక్కచెల్లెళ్లకు చెబుతాడు డాక్టర్‌. అనూహ్యంగా ఆ డబ్బు భవానీ అకౌంట్‌లో డిపాజిట్‌ అయి, ఆపరేషన్‌ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్‌ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్‌ ఓ కేస్‌ విషయమై న్యాయవాది పూన్‌గుండ్రన్‌తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్‌ విషయమై పూన్‌గుండ్రన్‌ని కలవమని భవానీ  వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్‌ గదిలో పడి ఉంటాడు.

 ప్రపంచానికి మాత్రం పూన్‌గుండ్రన్‌ బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. మరి ఆడవాళ్ళైన భవానీ అక్కచెల్లెళ్ళు న్యాయవాది శవంతో తమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ ‘జాలీ ఓ జిమ్ఖానా’ సినిమా. ఈ సినిమా ప్రారంభం నుండే సరదా సరదాగా సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులకు చక్కటి వినోదం మేళవించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నాటి ఆడవాళ్లకు మాత్రమే సినిమాలోని అప్పటి నటుడు నగేశ్‌ నటించిన ఓ సన్నివేశం ఈ సినిమా కథకి ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. సూపర్‌ ఎంటర్‌టైనర్‌ ఫర్‌ ది కంప్లీట్‌ ఫ్యామిలీ. వర్త్‌ టు వాచ్‌. – ఇంటూరు హరికృష్ణ

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)