Breaking News

వేట్టయన్‌, కంగువా, సినిమాల ఎఫెక్ట్‌.. కోలీవుడ్‌ కీలక నిర్ణయం

Published on Wed, 11/20/2024 - 12:48

ఇండియన్‌2, వేట్టయన్‌, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.

సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్‌ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్‌2. వేట్టయాన్‌,కంగువా  సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. 

దీనిని అరికట్టేందుకు థియేటర్‌ యజమానులు ముందుకు రావాలని తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్‌ ప్రాంగణంలోకి యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.

కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్‌ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్‌ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్‌ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్‌ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్‌ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)