Breaking News

సినీ రచయిత కన్నుమూత.. విజయ్‌ సేతుపతి సినిమాతో..

Published on Tue, 11/14/2023 - 10:37

తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మాటల రచయిత రాశితంగదురై (53) సోమవారం ఉదయం కన్ను మూశారు. వివరాలు.. ఆండిపట్టి సమీపంలోని కధిర్‌ నరసింగపురానికి చెందిన రాశితంగదురై చదువు పాఠశాల దశలోనే ఆగి పోయింది. అయితే కథలు, కవితలు రాయడంపై మక్కువ చూపిస్తూ రెండు వందలకు పైగా కథలు రాశారు. అలా సినీ రంగానికి మాటల రచయితగా పరిచయమయ్యారు.

నటుడు విజయ్‌ సేతుపతి నిర్మించిన మేర్కు తొడర్చిమలై చిత్రానికి మాటలు రాయడంతో పాటు చిన్న పాత్రను సైతం పోషించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. తరువాత తేన్‌ అనే చిత్రానికి సంభాషణలు అందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు కేవీ, తాక్కల్, ఆధారం తదితర చిత్రాలకు రాశి తంగదురై మాటలను రాశారు. మరో నాలుగైదు చిత్రాలకు కమిట్‌ అయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య మురుగేశ్వరి, కుమారులు రాశి ప్రియన్, సుఖదేవ్‌ దిలీపన్‌ ఉన్నారు. రాశి తంగదురై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: ఆ సినిమాలో ఛాన్స్‌ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్‌ ఏం చేశాడంటే: కస్తూరి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)