Breaking News

'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య

Published on Tue, 05/20/2025 - 16:56

తమిళ నటి, ప్రముఖ యాంకర్ ఐశ్వర్య రఘుపతి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె దుస్తులను ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఇప్పటికే ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే మరోసారి తాజాగా జరిగిన ఈవెంట్‌లోనూ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్లీవ్‌లెస్‌ దుస్తులపై ఓ రిపోర్టర్‌ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. ‍అయితే దీనికి ప్రతిస్పందనగా.. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని అడిగారు. దీనికి ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ అతన్ని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఐశ్వర్య దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత వారంలో ఐశ్వర్య రఘుపతి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమని తెలిపింది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఐశ్వర్య తన ప్రకటనలో రాసుకొచ్చింది.

ఇలా వేదికలపై తాను ఇలాంటి అసౌకర్య క్షణాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడని.. ఆ సంఘటన తన మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య చెప్పింది. కాగా.. ధనుష్ నటించిన  కెప్టెన్ మిల్లర్‌ చిత్రంలో ఐశ్వర్య రఘుపతి కనిపించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)