Breaking News

నడిగర్ సంఘం హెచ్చరిక.. ‍అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!

Published on Fri, 09/06/2024 - 07:35

హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం  అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు.  ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం  నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)