Breaking News

దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి

Published on Tue, 06/03/2025 - 20:42

కమల్ హాసన్‌ థగ్‌ లైఫ్‌ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్‌ లైఫ్‌ను బ్యాన్‌ చేస్తూ కేఎఫ్‌సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తమిళ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, సుదీప్‌ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్‌ లైఫ్‌ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్‌లో కమల్‌హాసన్‌ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్‌ ఎంతో సహకారం అందించారు. కన్నడ  చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్‌ లైఫ్‌ వాయిదా వేసినా.. బ్యాన్‌ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్‌ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.

కాగా.. థగ్‌ లైఫ్‌ ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌లో కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్‌సీసీ ఆయన సినిమా థగ్‌ లైఫ్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్‌ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)