Breaking News

తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Published on Mon, 06/12/2023 - 07:13

మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటనతో మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది భామ. అప్పట్లోనే అందం తిన్నానండీ అందుకే ఇలా ఉన్నానండీ అనే పాటను రాయడానికి ఒక గీత రచయితకు ప్రేరణగా నిలిచిన అందగత్తె నటి తమన్నాను అందుకే మిల్కీబ్యూటీ అంటారు. వెండితెరపై అందాల ఆరబోతలో తనకు తానే సాటి అనిపించుకునే తమన్నా అవకాశం వచ్చినప్పుడల్లా తనలోని నటనను చాటుకుంటూనే ఉన్నారు.


(ఇది చదవండి: సుశాంత్‌ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!)

 2005 నుంచి ఇప్పటి వరకు హీరోయిన్‌గా నటిస్తూ నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో కలిపి ఐదారు చిత్రాలు ఉన్నాయి. అందులో రజనీకాంత్‌తో కలిసి నటించిన జైలర్‌ చిత్రం ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతుండగా, ఆ మరుసటిరోజునే అంటే ఆగస్టు 11న తెలుగులో చిరంజీవితో నటించిన భోళాశంకర్‌ చిత్రం తెరపైకి రానుంది. ఈమె నటిస్తున్న తమిళ చిత్రం అరణ్మణై–4, మలయాళం చిత్రం బాంద్రా, హిందీ చిత్రం బోల్‌ చుడియన్‌ చిత్రాలు సెట్‌పై ఉన్నాయి.

ఈ 33 ఏళ్ల ఈ పరువాల సుందరి ఇంకా తన అందాలను మెరుగుపరుచుకునే పనిలోనే ఉన్నారు. అలా లేటెస్ట్‌గా తీయించుకున్న ఫొటోలను ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ గ్లామరస్‌ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే రజనీకాంత్‌ సరసన నటించిన జైలర్‌ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. 

రజనీకాంత్‌ తనను కలిసిన వారికి రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని, ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహూకరించడం ఆనవాయితీ. అదేవిధంగా నటి తమన్నాకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహూకరించారట. ఈ విషయాన్ని తమన్నా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ జైలర్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ తనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆయన సంతకంతో బహూకరించారని అది తనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

(ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్: స్టార్ హీరోయిన్)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)