Breaking News

ఎంతో కష్టపడ్డా.. అయినా బాహుబలితో అంత గుర్తింపు రాలేదు

Published on Wed, 06/14/2023 - 20:43

పాన్‌ ఇండియా సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇటువంటి సినిమాలు క్లిక్‌ అయితే కథానాయకులు పాన్‌ ఇండియా హీరోలైపోతారు. మరి హీరోయిన్స్‌? వారికి కూడా పేరొస్తుంది కానీ హీరోకు వచ్చినంత గుర్తింపు మాత్రం రాదు. ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్తోంది తమన్నా భాటియా.

'యాక్షన్‌ చిత్రాల్లో క్రెడిట్‌ అంతా హీరోలకే ఇస్తారు. బాహుబలి సినిమా క్రెడిట్‌ అంతా ప్రభాస్‌, రానాల ఖాతాలోకే వెళ్లిపోయింది. వాళ్లు కష్టపడ్డారు కాబట్టి ఆ క్రెడిట్‌ వారికి దక్కడం నాకు సమంజసంగానే అనిపించింది. ఈ సినిమా కోసం నేనెంతో కష్టపడ్డాను. కానీ నాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇందులో నా రోల్‌ అతిథి పాత్రలాగే ఉండిపోయింది' అని చెప్పుకొచ్చింది తమన్నా. 

కాగా బాహుబలి చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో మెరిసింది. మొదటి భాగంలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ రెండో భాగంలో మాత్రం తక్కువ నిడివికే పరిమితమైంది. ఇదిలా ఉంటే తన లవ్‌ లైఫ్‌పై మిల్కీ బ్యూటీ నోరు విప్పిన సంగతి తెలిసిందే! నటుడు విజయ్‌ వర్మతో లవ్‌లో ఉన్నట్లు ఒప్పేసుకుంది. 'విజయ్‌ వర్మతో నా బంధం చాలా సహజంగా మొదలైంది, ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురుచూశాను. 

జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్‌ వర్మను ఉద్దేశించి) దొరికాడు. అతడు చాలా కేర్‌ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది' అని పేర్కొంది. విజయ్‌, తమన్నా లస్ట్‌ స్టోరీస్‌ 2లో నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఉండొచ్చని తెలుస్తోంది.

చదవండి: రెండుసార్లు పెళ్లి, విడాకులు.. ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడ్డ బిగ్‌బాస్‌ బ్యూటీ

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి