Breaking News

విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్.. అలా ‍అనిపిస్తేనే చెబుతా: తమన్నా

Published on Thu, 03/20/2025 - 18:40

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్‌లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్‌ లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా.  నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్  లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు.

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)