Breaking News

బోనాల పండగలో...

Published on Tue, 07/30/2024 - 00:04

బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్‌ రోల్‌లో మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్‌ నంది సూపర్‌విజన్‌లో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (2021) సినిమాకి సీక్వెల్‌గా అశోక్‌ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

భారీ మల్లన్న టెంపుల్‌ సెట్‌లో క్లైమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్‌ ఆర్టిస్టులు షూటింగ్‌లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్‌ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్‌. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్‌ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌రాజన్‌.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)