Breaking News

హీరోయిన్‌ తమన్నా కేసు వాయిదా

Published on Thu, 08/22/2024 - 07:23

సినీ నటి తమన్నా కేసును చైన్నె హైకోర్టు వాయిదా వేసింది. నటి తమన్నా సినిమాల్లో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటన ప్రసారం గడువు పూర్తి అయినా సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపయోగించడంతో తమన్నా దాన్ని వ్యతిరేకిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తాను ఒక ప్రముఖ వాణిజ్య సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించానని, అయితే ఒప్పందం గడువు పూర్తి అయినా ప్రకటనను వాడుతుండటంతో తాను కోర్టును ఆశ్రయించానని, తన పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం ఆ ప్రకటనపై నిషేధం విధించిందని పేర్కొన్నారు. 

అయినప్పటికీ ఆ సంస్థ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తాను నటించిన ప్రకటనను ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కేసు న్యాయమూర్తులు సెంథిల్‌ కుమార్‌, రామమూర్తిల డివిజన్‌ బెంచ్‌లో విచారణకు వచ్చింది. దీంతో ఆ వాణిజ్య సంస్థ తరుపున హాజరైన న్యాయవాది ఆర్‌.కృష్ణ కుమార్‌ వాదిస్తూ నటి తమన్నా నటించిన తమ వాణిట్య ప్రకటన ప్రసారాన్ని తాము నిలిపి వేశామని, అయితే ప్రైవేట్‌ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వాడుతుంటే తాము ఎలా బాధ్యులమవుతామని పేర్కొన్నారు. 

దీంతో ఈ కేసులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయ మూర్తులు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేశారు. కాగా ఒక సబ్బు ప్రకటన సంస్థపై కూడా తమన్నా చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)