Breaking News

తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి

Published on Sat, 11/09/2024 - 09:36

మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్‌లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది.

(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)

ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.

ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు