Breaking News

మళ్లీ అదే డైరెక్టర్‌తో తమన్నాకు సినిమా ఛాన్స్‌

Published on Thu, 06/06/2024 - 06:58

 కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌.సీ చిత్రాలు కచ్చితంగా కమర్శియల్‌ అంశాలతో నిండి ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్‌ ఫార్ములా అని చెప్పవ చ్చు. ఇకపోతే హార్రర్‌ కామెడీ నేపథ్యంలో ఈయన చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇటీవల తమన్నా, రాశీ ఖన్నాలతో కలిసి సుందర్‌.సీ నటించి దర్శకత్వం వహించిన అరణ్మణై – 4 చిత్రం (తెలుగులో బాకు) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. 

తాజాగా మరోసారి దర్శకుడు సుందర్‌.సీ- తమన్నా కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్‌ నటి తమన్నాకు ఒక కథ చెప్పారనీ, అది నచ్చడంతో ఆమె అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఆ చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంస్థ ఆ కథను మాత్రం తీసుకుని సుందర్‌.సీ దర్శకత్వంలో నిర్మించాలని భావించగా, కథ నచ్చడంతో సుందర్‌.సీ కూడా దర్శకత్వం వహించడానికి సమ్మతించినట్లు తెలిసింది. 

ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో సుందర్‌.సీ, తమన్నాల హిట్‌ కాంబినేషన్‌ రీపీట్‌ కానుందన్నమాట. ఇకపోతే సుందర్‌.సీ ప్రస్తుతం తాను ఇంతకు ముందు రూపొందించిన కలగలప్పు చిత్రానికి సీక్కెల్‌ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేన్ని ముందుగా చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.   

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)