Breaking News

ప్రాణాంతకమైన గేమ్‌.. ఆ చేయి పట్టుకుంటే దెయ్యం వచ్చేస్తుంది!

Published on Sun, 08/03/2025 - 07:30

కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్‌ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్‌లో చెప్పాలంటే టాక్‌ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ దగ్గర రాతి చేయి ఉంటుంది. 

కథ
ఓ క్యాండిల్‌ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్‌ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్‌ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్‌. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్‌ ఆడతానంటాడు.

అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్‌ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్‌ ఆడిస్తారు. ఈసారి గేమ్‌ వైల్డ్‌గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్‌కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు. 

ఎలా ఉంది?
దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.

టాక్‌ టు మి.. ఆస్ట్రేలియన్‌ హారర్‌ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ప్రకటించారు. టాక్‌ టు మి 2 కథ ఇంకా డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది. 'టాక్‌ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్‌ ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)