Breaking News

నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్‌

Published on Sat, 08/13/2022 - 04:37

‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌  నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్‌ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘

‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్‌ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్‌ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్‌.

Videos

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

2026లో గోల్డ్ దూకుడు.. తులం 1,60,000 పక్క ?

31st నైట్ బిర్యానీ తిని వ్యక్తి మృతి.. ఆసుపత్రిలో 16 మంది !

స్విట్జర్లాండ్ లో భారీ పేలుడు

ప్రసాదంలో పురుగులు.. ఆలయాల్లో గజదొంగలు

గంజాయి డాన్ గా ఎదిగిన లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్

గదిలోకి పిలిచి.. నగ్నంగా వీడియోలతో బ్లాక్ మెయిల్

విదేశీ రహస్య ట్రిప్.. బాబు, లోకేష్ లో టెన్షన్..

2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం

YSRCP జడ్పీటీసీపై హత్యాయత్నం.. చూస్తుండగానే కర్రలు, రాడ్లతో దాడి

Photos

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)