Breaking News

సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?

Published on Wed, 03/12/2025 - 17:47

అందం, అభినయం..ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజీ సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి.. చిన్న వయసులోనే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది.  ఈ ప్రమాదంలో సౌందర్య(32)తో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్‌ హీరో మోహన్‌ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగింది?

→ 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. 

→ కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌  150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. 

→ ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో  సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. 

→ సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా, ఆమె మరణంపై వస్తున్న పుకార్లపై భర్త రఘు స్పందించారు.  మోహన్‌ బాబుతో తమకు ఎలాంటి గొడవల్లేవని, ఆస్తు వివాదాలు అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 

(చదవండి: మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)