ఆ నిర్మాత ఒంటరిగా హోటల్‌కి రమ్మన్నాడు : నటి

Published on Wed, 07/22/2026 - 13:08

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ గతంలో దీని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నటీనటులు భయపడేవాళ్లు. అవకాశాలు రావనో..లేదంటే వేరేలా అనుకుంటారేమోననని భయంతో బయటకు చెప్పేందుకు నిరాకరించేవాళ్లు. ఈ మధ్య మాత్రం మార్పు వచ్చింది. తమను వేధింపులకు గురి చేస్తే.. వెంటనే మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ.. కొత్తగా వచ్చే వాళ్లు అలాంటి వేధింపులను ఎలా ఎదుర్కోవాలో సలహా ఇస్తున్నారు.  

ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు, లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్‌ కౌల్‌ కూడా తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను, వాటిని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోని వ్యక్తులను ఎప్పుడు , ఎక్కడ, ఎలా కలవాలనే విషయంలో నాకు స్పష్టత ఉండేది. కెరీర్‌ ప్రారంభం నుంచే ముక్కు సూటిగా ఉండేదాన్ని. ఎవరైన హద్దులు దాటి వ్యవహరిస్తే సహించేదాన్ని కాదు. అందుకే క్యాస్టింగ్‌ కౌచ్‌ నాకు ఎదురవ్వలేదు’ అని అన్నారు.

నిర్మాత హోటల్‌కి రమ్మన్నాడు.. 
ఇదే ఇంటర్వ్యూలో కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఓ సంఘటన గురించి సింపుల్‌ కౌల్‌ వివరించారు. ‘ఓ సినిమా కోసం నిర్మాత కాల్‌ చేశాడు. సాయంత్రం ఒంటరిగా హోటల్‌కి రమ్మని చెప్పాడు. నేను స్నేహితులతో కలిసి వెళ్లా. ఈ విషయం హోటల్‌కి వెళ్లాక ఆయనకు చెప్పాను. నన్ను ఒంటరిగా గదిలోకి రమ్మని ఆహ్వానించాడు. నేను రానని చెప్పా. కలవాలనుకుంటే హోటల్‌ లాబీలోనే కలుసుకోవచ్చు అని అతని చెప్పా. అంతే కానీ అవకాశం వస్తుంది కదా అని అతను చెప్పినట్లుగా వెళ్లలేదు.

టాలెంట్‌ని నమ్ముకోండి..
నా ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో అనౌకర్యంగా అనిపించే సీన్‌లో ఎప్పుడూ నటించలేదు. చర్చల కోసం ఆహ్వానించినా.. ఒంటరిగా వెళ్లేదాన్ని కాదు. చిత్రబృందం సమక్షంలోనే కథను వినేదాన్ని. కొత్తగా వచ్చే వాళ్లకు నా సలహా ఏంటంటే.. ‘అసౌకర్యంగా అనిపించే ఏ పనినైనా చేయకండి. ఎంత పెద్ద ఆఫర్‌ వచ్చినా.. అంతరాత్మ చెప్పిందే వినండి. రాజీ పడితేనే అవకాశాలు వస్తాయని అనుకోకండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి’అని సింపుల్‌ కౌల్‌ సలహా ఇచ్చారు.  2002లో ఏక్తా కపూర్ నిర్మించిన ' కుసుమ్' సీరియల్‌తో నటనారంగంలోకి అడుగుపెట్టారు సింపుల్‌ కౌల్‌. ఆ తర్వాత 'షరారత్' , 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పెందారు .

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)