గోడౌన్ లో గోమాంసం.. TDP నేతను తప్పించేందుకు బిగ్ ప్లాన్
హరిహర వీరమల్లు ‘ఐటమ్ సాంగ్’ వచ్చేసింది
Published on Wed, 05/28/2025 - 11:03
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu ). ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘తార తార నా కళ్లు..వెన్నల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకి శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది.
#
Tags : 1