హీరోయిన్‌ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్‌ చేస్తున్నారు: తాప్సీ

Published on Sun, 11/03/2024 - 18:00

సినిమాలో ఏ హీరోయిన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్‌ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్‌ ధావన్‌ 'జుడ్వా', షారూఖ్‌ ఖాన్‌ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?
నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్‌ దిల్‌రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్‌ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.

హీరోలే డిసైడ్‌ చేస్తున్నారు
ఒక సినిమాలో ఆల్‌రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్‌గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్‌ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్‌ఫుల్‌ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్‌ను తీసుకుంటారు.

ట్రెండింగ్‌లో ఉన్నవారే కావాలి!
ఎక్కువగా హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్‌ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్‌ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్‌ ఖేల్‌ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)