హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు

Published on Sat, 03/21/2026 - 06:33

నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్‌ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. 

కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. 

ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్‌ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.  

Videos

జగన్ కంటే ఎక్కువ విజయమ్మ గారు.. కానీ ఆవిడ రాసిన లెటర్.. పుత్తా శివ శంకర్ రియాక్షన్

పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య

లక్ష పెడితే ₹58 లక్షలు.. మ్యాన్ బ్రో ఇండస్ట్రీస్ షేర్ సంచలనం

పెద్ది మళ్ళీ పోస్ట్ పోన్.. ఏప్రిల్ 30 రిలీజ్ లేనట్టే..!

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

యూట్యూబర్ వైష్ణవి మృతిని జీర్ణించుకోలేని సోదరులు

చిన్నారిపై విరోష్ జంట ముద్దుల వర్షం

కొడుకంటే ప్రాణమే.. కానీ వాళ్ళు పెట్టే బాధలు ఎలాంటివి అంటే..

సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

Photos

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)