Breaking News

నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్‌ విషయంపై సోహైల్ ఫైర్‌

Published on Wed, 12/20/2023 - 09:48

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్‌ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌ రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్‌ దీప్‌ ఉన్నాడు. బిగ్‌ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్‌ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్‌, ప్రశాంత్‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్‌దీప్‌ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్‌ అవుతున్నారు.

తాజాగా స‌య్యద్ సోహైల్ రియాక్ట్‌ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్‌ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో  ఇలా అమర్‌పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్‌... ఆ దాడి సమయంలో అమర్‌తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్‌ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు.

మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్‌... నేను కూడా  ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు..

కానీ అమర్‌ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్‌ అయ్యాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)