Breaking News

ప్రసాదం లేదంటే చంపేస్తారా.. మనం రాక్షసులుగా మారిపోయాం: ప్రముఖ నటి

Published on Mon, 09/01/2025 - 12:22

ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ కల్కాజీ ఆలయంలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. రెండురోజుల క్రితం ఆలయంలో ప్రసాదం పంపిణీ సమయంలో భక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రసాదం స్టాక్‌ అయిపోయిందని ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్(35) చెప్పడంతో సహించలేని కొందరు యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో యోగేంద్రను బయటకు లాగి, అతను చనిపోయేంత వరకు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తను ప్రాణాలు వదిలేసిన సరే కర్రలతో కొడుతూనే ఉన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటనపై నటి స్వర భాస్కర్‌ రియాక్ట్‌ అయ్యారు.

ఈ సంఘటనపై తాజాగా నటి స్వర భాస్కర్‌ ఇలా రియాక్ట్‌ అయ్యారు.' ఇది చాలా దారుణం, భయంకరమైన సంఘటన.  ప్రజలను కొట్టి చంపడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. అందరికీ చిరాకు తెప్పించేలా ఉంది. సిగ్గుచేటు, మన సమాజం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. మనం రాక్షసులుగా మారిపోయాం.' అని ఆమె రాసింది.

దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్‌ను AIIMS ట్రామా సెంటర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం మొత్తం అతనిపైనే ఆధారపడి జీవిస్తుంది. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక నిందితుడు అతుల్ పాండేను అరెస్ట్ చేశారు, మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)