Breaking News

సుష్మితా సేన్‌కు గుండెపోటు, వెల్లడించిన నటి

Published on Thu, 03/02/2023 - 16:46

అప్పటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ ఉన్నవాళ్లు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఏమైందని ఆలోచించేలోపే ప్రాణాలు గాల్లో వదిలేస్తున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తక్షణమే స్పందిస్తే వారిని కాపాడుకోగలమని పరిస్థితి చేయిదాటిపోతే ఏమీ చేయలేమని వైద్యులంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ తాను కూడా గుండెపోటుకు గురయ్యానని చెప్తూ బాంబు పేల్చింది.

'మీ గుండెను పదిలంగా కాపాడుకోండి, అప్పుడే అది ఆపత్కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మంచి మాట నాన్న చెప్పేవాడు. కొద్దిరోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. ఆంజియోప్లాస్టీ జరిగింది. స్టంట్‌ వేశారు. డాక్టర్‌ ఏమన్నాడో తెలుసా? నాకు విశాలమైన హృదయం ఉందట! ప్రస్తుతం నేను బాగున్నాను.. మిగిలిన జీవితాన్ని కొనసాగించేందుకు రెడీగా ఉన్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రితో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసింది. దీనికి గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అన్న క్యాప్షన్‌ను జోడించింది.

దీనిపై సోఫీ చౌదరి స్పందిస్తూ.. ఓ మై గాడ్‌.. నీకు అనంతమైన ప్రేమను పంపిస్తున్నాను. నువ్వు, నీ గుండె అన్నింటికన్నా ధృడమైనది అని కామెంట్‌ చేసింది. మిగతా నెటిజన్లు, సెలబ్రిటీలు సైతం జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మితా సేన్‌ చివరగా ఆర్య 2 వెబ్‌ సిరీస్‌లో నటించింది. మూడో సీజన్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి చేసేసింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు