Breaking News

ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్‌ తమ్ముడు

Published on Tue, 07/19/2022 - 15:32

Sushmita Sen Brother Rajeev Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం వ్యాపారవేత్త, ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేయడమే. అయితే తాజాగా సుష్మితా సేన్‌కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశమైంది. సుష్మితా తమ్ముడు రాజీవ్‌ సేన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తను అన్‌ఫాలో చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజీవ్‌, అతని భార్య చారు అసోపాతో వివాహమైన మూడేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడంలో తప్పు రాజీవ్‌దేనని, అందుకే సుష్మితా సేన్‌ అతని మాజీ భార్య చారుకు సపోర్ట్ చేస్తుందని కథనాలు వెలువడ్డాయి. 

ఈ కథనాలపై తాజాగా రాజీవ్‌ స్పందించాడు. 'నా సోదరి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వట్లేదని మీడియా చెబుతోంది. అసలు ఆమె ఎప్పుడూ నన్ను ఫాలో కాలేదు, కొత్తగా అన్‌ఫాలో చేయడానికి. ఈ వార్త నన్ను కలిచివేసింది. అందుకే ఈ విషయం గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. సుష్మితా నన్ను కేవలం ఒక ట్విటర్‌లోనే ఫాలో అవుతోంది. అది కూడా చాలా కాలంగా. ఇక రెండో విషయం ఏంటంటే ? నా భార్య చారుని ఫాలో అవుతూ ఆమెకు సుష్మితా మద్దతుగా నిలిచిందని మీడియా పేర్కొంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే.. మా అక్క సుష్మితా చాలా తెలివైనది. మేము దేని గురించి నిలబడతామో ఆమెకు చాలా బాగా తెలుసు. అలాగే తను బాధితురాలిగా మెలగడంలో ఎంత గొప్ప నేర్పరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది' అని తెలిపాడు. 

మరి సుష్మితా సేన్‌ ఆమెను ఎందుకు ఫాలో అవుతుందని అడిగిన ప్రశ్నకు 'అది ఆమెనే అడిగి తెలుసుకోండి' అని సమాధానమిచ్చాడు. కాగా చారు అసోపా తన మొదటి పెళ్లి గురించి అతని దగ్గర దాచిందని గతంలో ఆరోపణలు చేశాడు రాజీవ్‌. అయితే ఇప్పుడు ఆమె మూవ్‌ ఆన్‌ అయిందని, ముంబైలో సంతోషంగా జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నాను చెప్పుకొచ్చాడు.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)