Breaking News

'భాయ్ ఇంకా మనతోనే ఉన్నారు'.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్

Published on Sun, 06/15/2025 - 12:55

ధోని మూవీలో అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సుశాంత్ ఊహించని రీతిలో మృతి చెందారు. నేటికి సుశాంత్‌ మనకు దూరమై ఐదేళ్లు పూర్తయింది.  ఈ సందర్భంగా సుశాంత్‌ను గుర్తు చేసుకున్న అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను చాలా మిస్సవుతున్నట్లు రాసుకొచ్చింది. భౌతికంగా మీరు లేకపోయినా మాతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారంటూ ఎమోషనలైంది. 

 శ్వేత ఇన్‌స్టాలో రాస్తూ..' మా అన్న జూన్ 14, 2020న ఈ లోక విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. దాని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే.. ఏమి జరిగినా దేవునిపై విశ్వాసం కోల్పోకండి. మన సుశాంత్  జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అతని చిరునవ్వు, చిన్నపిల్లవాడిలాంటి అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలదు. మన సుశాంత్ దేనికోసం నిలబడ్డారో.. మనం దానికోసం నిలబడాలి' అంటూ రాసుకొచ్చింది.

'భాయ్ ఎక్కడికీ వెళ్లలేదు. అతను మీలో, నాలో, మనందరిలోనే ఉన్నాడు. మనం మరింత నేర్చుకోవాలనుకునే ప్రతిసారీ అతన్ని గుర్తు చేసుకుందాం. అతనికి ఇష్టం లేని నెగెటివ్  భావనను వ్యాప్తి చేయడానికి భాయ్ పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే సుశాంత్ దాని కోసం నిలబడలేదు. భాయ్ ఎంత మంది హృదయాలను ప్రభావితం చేశాడో చూడండి. అన్న పేరును నిలిచిపోయేలా చేయండి.' అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.

కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాపు. ఆ తర్వాత కొందరు ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సీబీఐ నివేదికను కోర్టుకు సమర్పించింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు