Breaking News

మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్‌ సోదరి సంచలన ఆరోపణలు

Published on Tue, 04/11/2023 - 18:54

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్‌ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. 

ప్రియాంక ట్వీట్‌లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది.

కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్‌ఫ్రెండ్‌ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్‌కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్‌లో ఉన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)