Breaking News

అందుకే వెంటనే ఓకే చెప్పాను

Published on Tue, 04/04/2023 - 02:48

‘‘రావణాసుర’ వైవిధ్యమైన చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్‌ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాలేదు. అందుకే కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పాను’’ అని సుశాంత్‌ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సుశాంత్‌ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్‌ రోల్‌ని రవితేజగారు చేశారు. నేను రామ్‌ పాత్ర చేశా. మా ఇద్దర్నీ సుధీర్‌గారు సరికొత్తగా చూపించారు. నా పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే ఎగ్జయిట్‌మెంట్‌ ఉంది. ‘రావణాసుర’ కంప్లీట్‌ థ్రిల్లర్‌. వెర్సటైల్‌ యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ‘రావణాసుర’లో నన్ను తీసుకోవాలనే ఆలోచన అభిషేక్‌గారిదే. ఇందుకు ఆయనకు థ్యాంక్స్‌.

‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఉత్తరాదిలో కూడా ఫేమ్‌ తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా నన్ను ఎగ్జయిట్‌ చేసిన ‘రావణాసుర, భోళా శంకర్‌..’ లాంటి సినిమాలు మాత్రమే ఒప్పుకున్నాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం నా లక్‌. నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకువెళ్లాను. కొన్ని సినిమాల షూటింగ్‌ ఆలస్యం కావడం, అనుకున్న టైమ్‌కి విడుదల కాకపోవడం వల్ల గ్యాప్‌ వస్తోంది. ‘చిలసౌ’ తర్వాత ఇక గ్యాప్‌ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే కోవిడ్‌ వల్ల గ్యాప్‌ వచ్చింది. కానీ ఆరు నెలలుగా బిజీగా ఉన్నాను. ‘భోళా శంకర్‌’లో కీ రోల్‌ చేస్తున్నాను. అలాగే సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను’’ అన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు