Breaking News

ఆ హీరోయిన్‌ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత

Published on Sun, 07/27/2025 - 11:21

టాలీవుడ్‌ యంగ్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికి తెలిసిందే. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్‌ వివాదస్పదంగానూ మారిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఫోకస్‌ అంతా సినిమాలపైనే పెడుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. 

తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్‌’. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘జర్సీ’ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ని తిరుపతిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగ్యశ్రీపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చడం వల్లే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారు?’ అని యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు వంశీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.

‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్‌గా పెట్టుకున్నాను. విజయ్‌ కానీ, గౌతమ్‌ కానీ నన్ను అడగలేదు. నాకు భాగ్యశ్రీని నచ్చి హీరోయిన్‌గా తీసుకున్నాను. నేను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను’ అని వంశీ అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)