Breaking News

బాజా మోగించి...

Published on Fri, 07/24/2026 - 03:22

సూర్య హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. మమిత బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్‌ విశ్వనాథ్‌ అనే పాత్రలో నటించారు సూర్య.

గురువారం (జూలై 23) సూర్య బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’లోని పెళ్లి పాట లిరికల్‌ వీడియో ప్రోమోను రిలీజ్‌ చేసి, ఈ పూర్తి పాటను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ‘ఆజా అన్నాడే... రాజా చిన్నోడే... బాజా మోగించి తాళి కట్టేస్తాడే..’ అన్న లిరిక్స్‌ ఈప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి యూరప్‌లో ఓ కీలక షెడ్యూల్‌ జరిగింది.

యూరప్‌లో ఈ వెడ్డింగ్‌ సాంగ్‌ను చిత్రీకరించారని సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య పాడటం విశేషం. ఇక తనకంటే వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన హీరోను ఓ యంగ్‌ గర్ల్‌ ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది.  
 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)