Breaking News

మరో ఆలోచన లేకుండా మాకు డబ్బులిచ్చింది

Published on Mon, 08/03/2026 - 16:42

తమిళ స్టార్ హీరోల్లో పలువురికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వాళ్లలో సూర్య, కార్తి ముందు వరసలో ఉంటారు. అయితే రాధిక తమ కుటుంబానికి ఆపత్కాలంలో ఆర్థిక సాయం చేసిందని చెప్పిన సూర్య.. ఆమెని ఎప్పటికీ మర్చిపోలేం అని ఎమోషనల్ అయ్యాడు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆడియో లాంచ్ సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'కార్తీ.. అమెరికాలో చదివేందుకు వెళ్లాల్సిన టైంలో వీసా ప్రక్రియలో భాగంగా బ్యాంక్ అకౌంట్‌లో సరిపడా డబ్బులు ఉండాలి. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు. ఈ విషయం తెలుసుకున్న రాధిక అక్క.. మరో ఆలోచన లేకుండా అవసరమైన మొత్తాన్ని ఇచ్చింది. కార్తీకి కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు ఈ డబ్బులు అకౌంట్‌లో ఉంచుకోమని చెప్పింది. ఆమె చేసిన సాయాన్ని మా ఫ్యామిలీ జీవితాంతం మర్చిపోదు' అని సూర్య చెప్పుకొచ్చాడు.

అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసిన కార్తీ.. చెన్నైకి తిరిగి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకుడు మణిరత్నం దగ్గర 'ఆయుధ ఎళుత్తు'తో పాటు దాని హిందీ వెర్షన్ 'యువ' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే రాధిక.. సూర్య, కార్తీ సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. కార్తీ 'సర్దార్ 2' సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు 'మార్షల్' అనే తమిళం మూవీ.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' తీసిన కల్యాణ్ శంకర్‌తో, 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను, దర్శకుడు మోహన్ రాజాతోనూ ఓ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. 

(ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)