Breaking News

రజనీకాంత్‌ కోసం సూర్య భారీ త్యాగం!

Published on Thu, 09/19/2024 - 11:56

కంగువా చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్తనే నిజమైంది. సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే సీజీ వర్క్‌ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు మేకర్స్‌.  నవంబర్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు.

వేట్టయాన్‌ కోసమే వాయిదా?
రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్‌’. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్‌ నిర్మించారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్, రానా, ఫాహద్‌ ఫాజిల్, మంజు వారియర్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్‌’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్‌ కానుంది. అదే తేదిన కంగువా రిలీజ్‌ కావాల్సింది. మేకర్స్‌ ముందే ప్రకటించారు. అయితే బరిలోని రజనీకాంత్‌ సినిమా రావడంతో సూర్య వెనక్కి తగ్గారు. తనకంటే సీనియర్‌ హీరో సినిమాతో పోటీ వద్దని సూర్య చెప్పారట. దీంతో అక్టోబర్‌ 10న కాకుండా నవంబర్‌ 14న విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. 

(చదవండి: అటు ప్రభాస్‌.. ఇటు మహేశ్‌.. కరీనాకి డబుల్‌ చాన్స్‌!)

మూడు విభిన్న పాత్రల్లో సూర్య
కంగువా చిత్రం కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారట. రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా ‘కంగువా’ కోసం శ్రమించారని ఓ ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్‌ కూడా భారీగానే అయిందట. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విజువల్స్‌ పరంగా ఈ చిత్రం సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్‌ ముందు నుంచి చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)