Breaking News

ఐశ్వర్యరాయ్‌తో వివేక్‌ ప్రేమాయణం.. నటుడు ఏమన్నాడంటే?

Published on Tue, 12/19/2023 - 15:08

కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు వివేక్‌ ఒబెరాయ్‌- ఐశ్వర్యరాయ్‌ లవ్‌స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్‌ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్‌తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్‌ ఒబెరాయ్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్‌ ఎప్పుడూ నాతో ఓపెన్‌గా చెప్పలేదు. రాము (రామ్‌ గోపాల్‌ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు.

ఐశ్వర్యతో లవ్‌.. వద్దని వారించా
రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌తో బ్రేకప్‌ చెప్పిన వెంటనే వివేక్‌తో ప్రేమలో పడింది ఐష్‌. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్‌ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్‌ బచ్చన్‌ను పెళ్లాడి అమితాబ్‌ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్‌.

ఎవరీ సురేశ్‌- వివేక్‌..
సురేశ్‌ ఒబెరాయ్‌ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయ్యాడు. మిర్చ్‌ మసాలా, ఐత్‌బార్‌, లావారిస్‌, ఘర్‌ ఏక్‌ మందిర్‌ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్‌ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్‌ ఒబెరాయ్‌.. రక్త చరిత్ర, క్రిష్‌ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్‌ నరేంద్రమోది బయోపిక్‌లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు.

చదవండి: దావూద్‌ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్‌.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)