Breaking News

అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్‌ హీరోయిన్లకూ అదే కర్మ?

Published on Wed, 06/18/2025 - 12:48

అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్‌కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.

నటన రాదని హేళన
అనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్‌ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్‌ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్‌ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్‌ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.

ఆ హీరోయిన్ల విషయంలోనూ..
ఒకప్పుడు హీరోయిన్‌ సిమ్రాన్‌ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్‌ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. ‍కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్‌, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ జూన్‌ 27న విడుదల కానుంది.

సినిమా
అనుపమ విషయానికి వస్తే.. నివీన్‌ పౌలీ 'ప్రేమమ్‌' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్‌', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్‌, 18 పేజీస్‌, టిల్లు స్క్వేర్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ, బైసన్‌, లాక్‌డౌన్‌, పరదా, పెట్‌ డిటెక్టివ్‌ చిత్రాలున్నాయి.

చదవండి: హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)