Breaking News

ఎవరూ రాలేదని నన్ను పట్టుకుని ఏడ్చేశాడు: నటుడు

Published on Wed, 03/20/2024 - 17:05

కళాభవన్‌ మణి.. ఈ మలయాళ‌ నటుడు తెలుగువారికీ సుపరిచితుడే! జెమిని, ఆయుధం, అర్జున్‌, నరసింహుడు, నగరం.. ఇలా పలు సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు. ప్లేబ్యాక్‌ సింగర్‌గానూ తన టాలెంట్‌ చూపించాడు. మలయాళ చిత్రపరిశ్రమలోనే తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా సత్తా చాటాడు.

రక్తం కక్కుకుని..
విభిన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతడు మద్యం అతిగా తాగడం వల్లే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఫోరెన్సిక్‌ టెస్ట్‌లో పురుగుమందు ఆనవాళ్లు కూడా లభించడంతో అప్పట్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

చూడగానే నచ్చేశాడు
ఈ విషయాన్ని పక్కన పెడితే కళాభవన్‌ మణితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నటుడు సురేశ్‌ గోపి. 'ఫస్ట్‌ టైం మణిని చూడగానే నచ్చేశాడు. ఇప్పటికీ తనపై నాకు ఆ ప్రేమ, అభిమానం అలాగే ఉంది. అతడి పేరు ఎత్తగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటేమో.. అరేబియన్‌ డ్రీమ్స్‌ అని ఓ షో కోసం మేమంతా దుబాయ్‌ వెళ్లాము. నా గది పెద్దదిగా ఉంటుంది.

మర్చిపోలేని జ్ఞాపకం..
మేమంతా కలిసి ఒకే గదిలో కింద కార్పెట్‌ వేసుకుని నిద్రించాము. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం.. ఇంకోటి.. అతడి పెళ్లి రోజు. నన్ను చూడగానే సంతోషంతో ఏడ్చేశాడు. తన పెళ్లికి ఎవరూ రాలేదని, నేనొక్కడినైనా వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే మనసు భావోద్వేగానికి లోనవుతుంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: చాయ్‌ తాగేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితి.. ఆ హీరో ఆదుకోవడం వల్లే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)