నెక్ట్స్‌ మహానటి ఎవరు? ఆ స్టార్‌ హీరోయిన్‌ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు

Published on Mon, 12/05/2022 - 11:20

నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్‌ షోకు లేటెస్ట్‌ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్‌ ఎన్టీఆర్‌) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్‌ గెస్ట్‌లుగా టాలీవుడ్‌ బడా నిర్మాతలు అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్‌లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్‌ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్‌ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు.

సురేశ్‌ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్‌ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్‌ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్‌ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్‌ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు.

తన సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. 

Videos

కోతల రాయుడు.. ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్

70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక , రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)