Breaking News

అతను నా నెంబర్‌ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడు: సురేఖ వాణి కూతురు

Published on Wed, 02/11/2026 - 14:02

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్‌ పెడితే క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్‌ కూడా చేస్తుంటారు. మరికొంతమంది అయితే సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు ప్రపోజ్‌ కూడా చేస్తుంటారు. అలా తనకు వెరైటీగా వచ్చిన ఒక ప్రపోజల్‌ గురించి మీడియాతో పంచుకుంటి అందాల తార సుప్రీత. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చిన ఓ వెరైటీ ప్రపోజల్‌ గురించి చెప్పుకొచ్చింది.

‘నాకు రెగ్యులర్‌గా ప్రపోజల్స్‌ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నేను లైట్‌ తీసుకుంటా. కొన్ని మెసేజ్‌లు చూసి నవ్వుకుంటాను. ఈ మధ్య ఒకతను నా మొబైల్‌ నెంబర్‌ కోసం రూ. 20 వేలు ఖర్చు చేశాడట. నా నెంబర్‌ కనుకొన్ని ఆయన మెసేజ్‌ చేశాడు. ‘మీ నెంబర్‌ కోసమే నేను రూ. 20 వేలు ఖర్చు చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి. నన్ను పెళ్లి చేసుకో.. చాలా బాగా చూసుకుంటాను. మీ నెంబర్‌ కోసమే అంత డబ్బు ఖర్చు చేశానంటే.. నిన్ను ఎలా చూసుకుంటానే అర్థం చేసుకో’ అని స్మార్ట్‌గా ప్రపోజ్‌ చేశాడు. ఆ మెసేజ్‌ చూసి నవ్వుకొని అతన్ని బ్లాక్‌ చేశా’ అని సుప్రీత చెప్పుకొచ్చింది.

ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెబుతూ.. ‘నన్ను భరించేవాడు దొరికితే చాలు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. అలా అని ఖాలీగా ఉండకూడదు. ఏదో ఒక బిజినెస్‌ చేస్తూ..ఫ్రీ టైం మొత్తం నాతోనే గడపాలి. కలిసి బయటకు వెళ్లాలి.  నేనే ఎక్కువ కేరింగ్‌ చేస్తా. నేను వండి పెట్టింది తింటూ నాతో ఉంటే చాలు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. 
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు