Breaking News

భారత్‌లో 'సూపర్‌ మ్యాన్‌'.. ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌​ ఇదే

Published on Tue, 12/09/2025 - 07:48

హాలీవుడ్‌ సినిమా  ‘సూపర్‌ మ్యాన్‌’ ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా ఉచితంగానే చూసే అవకాశం రానుంది. డీసీ యూనివర్స్‌లోని ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. 1984 నుంచి ఈ జానర్ మూవీస్ ప్రేక్షకుల్ని అలరిస్తూనే  ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఏడాది విడుదలైన  ‘సూపర్‌ మ్యాన్‌’ ఇప్పటికే  అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా  ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌ ఈ సినిమాపై అప్‌డేట్‌ ప్రకటించింది. భారత్‌లో  డిసెంబరు 11 నుంచి సూపర్‌ మ్యాన్‌ స్ట్రీమింగ్‌కు రానుందని పేర్కొంది.   ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు హిందీ, తమిళ  భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 6వేల కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో భారతీయ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్‪‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‍‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌