ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
విషాదం.. ‘సూపర్‌మ్యాన్' నటి కన్నుమూత
Published on Tue, 03/24/2026 - 13:31
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, ‘సూపర్‌మ్యాన్' ఫేం వాలెరీ పెర్రిన్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో బెవర్లీ హిల్స్ సమీపంలో ఉన్న తన ఇంట్లో పెర్రిన్ మరణించినట్లు ఆమె స్నేహితుడు, ఆత్మీయ సహచరి అయిన స్టేసీ సౌథర్ ప్రకటించారు.
2015లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని కారణంగా గతకొంతకాలంగా ఆమె మంచానికే పరిమితం అయింది. మాట్లాడే సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఇన్నాళ్లు జీవిందని సౌథర్ అన్నారు. ఫారెస్ట్ లాన్ స్మశానవాటికలో ఖననం చేయాలన్నది పెర్రిన్ చివరి కోరిక అని చెబుతూ, సౌథర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టిన పెర్రిన్, తన గ్లామర్,నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1978లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా 'సూపర్‌మ్యాన్'లో విలన్ లెక్స్ లూథర్ ప్రియురాలిగా, 'మిస్ టెష్మాకర్' పాత్రలో వాలెరీ పెర్రిన్ అద్భుత నటనను కనబరిచారు. ఈ పాత్ర ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
'సూపర్‌మ్యాన్ II'తో పాటు, 'లెన్నీ' (Lenny) అనే చిత్రంలో ఆమె నటనకు గానూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు లభించింది. అంతేకాకుండా ఆమె ఆస్కార్ రేసులో కూడా నిలిచారు. పెర్రిన్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags : 1