Breaking News

రజినీకాంత్‌ సంచలన కామెంట్స్‌.. మండిపడుతున్న ఫ్యాన్స్‌!

Published on Sun, 08/25/2024 - 15:26

కోలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రస్తుతం వెట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా రజినీకాంత్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలను ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలు మరో స్టార్‌ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్‌ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీకి ఎదుర్కొనే శక్తి ఉందన్నారు.  మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంటసేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని రజినీకాంత్ కొనియాడారు. ఎ.వి.వేలు రచించిన కళైంజ్ఞర్‌ ఎనుమ్‌ థాయ్‌ అనే పుస్తకావిష్కరణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్

అయితే కోలీవుడ్ స్టార్‌హీరో, దళపతి ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్‌ పార్టీని ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తలైనా చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)