Breaking News

సూపర్‌ సింగర్‌.. ఆరోజే ప్రారంభం!

Published on Thu, 12/21/2023 - 17:09

మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్‌ షో. ఇలాంటి సింగింగ్‌ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో  16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే.

చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు