Breaking News

ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on Wed, 07/01/2026 - 20:20

ఓటీటీలు వచ్చాక కంటెంట్‌కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

తాజాగా మరో సక్సెస్‌ఫుల్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్‌ సక్సెస్‌ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్‌లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్‌బీట్‌ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకున్నాయి.

అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్‌కు దీపక్‌ సుందర రాజన్‌ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)