Breaking News

సూపర్ హిట్ సిరీస్‌ మూవీ.. దృశ్యం-3 రిలీజ్‌ ఎప్పుడంటే?

Published on Wed, 01/14/2026 - 18:17

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్‌ కూడా బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్‌ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్‌లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాగా.. ఈ సమ్మర్‌లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది.  కాగా.. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ చెప్పారు.

 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)