వరదలో మూడు కార్లు కొట్టుకుపోయాయి: సన్నీలియోన్‌

Published on Thu, 08/10/2023 - 17:12

ముంబై వరదల వల్ల ఎంతగానో నష్టపోయానంటోంది హీరోయిన్‌ సన్నీలియోన్‌. తను ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన కార్లు వరదలో కొట్టుకుపోయాయని వాపోయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ముంబైలో ఉంటున్నాను. పని కోసం ముంబైకి వచ్చినప్పుడు నేను ఉండే ఇంటి పరిస్థితి చూసి ఆందోళన చెందేదాన్ని. గోడల నుంచి నీళ్లు కారేవి. అధిక తేమ వల్ల చాలా వస్తువులు తడిగా ఉన్నట్లు అనిపించేది. అయినా సరే అక్కడి వాతావరణం నాకెంతో నచ్చేది. చెప్పాలంటే వర్షాకాలం అంటే ఎంతో ఇష్టం.

ఆకాశం నుంచి చినుకులు నేలను తాకుతుంటే ముచ్చటగా అనిపించేది. కానీ ఆ వర్షపు నీళ్లు ఇంటి లోపలదాకా వస్తే మాత్రం నచ్చేది కాదు. ఓసారి తీవ్ర వర్షాలు పడటంతో నా మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. అందులో రెండైతే ఒక్కరోజులోనే మాయమైపోయాయి. మేఘాలు అంత వర్షాన్ని దాచుకున్నాయా? అనిపించింది. చాలా బాధపడ్డా.. ఒకరకంగా ఏడ్చేశాను కూడా! ఎందుకంటే ఇండియాలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ టాక్స్‌ కట్టాలి.

ఒక కారైతే ఎనిమిది మంది కూర్చునే మెర్సిడిస్‌ ట్రక్‌. వాటిని పోగొట్టుకున్నందుకు ఎంత ఫీలయ్యానో! అయితే ఇప్పుడు నేను ఇండియాలోనే తయారు చేసిన కార్లు వాడుతున్నాను. అవి నాకు చాలా నచ్చాయి' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. కాగా సన్నీ లియోన్‌ ప్రస్తుతం కొటేషన్‌ గ్యాంగ్‌ అనే తమిళ చిత్రం చేస్తోంది. వివేక్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, ప్రియమణి, సారా అర్జున్‌, వి.జయప్రకాశ్‌, విష్ణు వారియర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: మరో రెండు,మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా: విజయ్‌ దేవరకొండ

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)