తెలుగు షోలో సన్నీ లియోన్.. ఇదెక్కడి ట్విస్టురా మావ!

Published on Fri, 09/29/2023 - 09:12

బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్‌ రవి కూడా ఉన్నారు.  

(ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్‌ ఆంటోనీ)

ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి? 

ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్‌బోర్డ్‌పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)