Breaking News

వేసవిలో జాట్‌

Published on Sat, 01/25/2025 - 01:05

బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌(Sunny Deol) హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్‌’. రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది.

ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్‌ మూవీగా ‘జాట్‌’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్‌’ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: బాబా సాయికుమార్‌ మామిడిపల్లి, జయ ప్రకాశ్‌ రావు (జేపీ).

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)